అద్దంలో కనిపిస్తున్న ఈ అస్థిపంజరం ఎవరిది?
రోగిష్టి నీ తలపించే దేహం.. ఎముకల గూడు.. ఈ వికృత రూపం నాదేనా?
ఒంటికన్నుతో ప్రపంచాన్ని వెక్కిరిస్తూ,
పొగచూరిన పెదవుల వెనుక మౌనంగా రోదిస్తున్నాను.
పల్చబడిన జుట్టు, వెక్కిరిస్తున్న బట్టతల..
నిద్రలేని రాత్రుల సాక్షిగా కళావిహీనమైన చర్మం,
దురదృష్ట దేవత ముద్రవేసిన ఈ లలాటం..
నన్ను చూసి నేనే అసహ్యించుకునే ఈ బ్రతుకు ఒక నరకం!
నాకూ కావాలి.. ప్రేమించే హృదయం ఒకటుందని భ్రమ,
నా మనసును తడిమే ఓదార్పు కావాలని ఆరాటం!
కానీ.. నా దరిద్రపు నీడ పడితే పచ్చని చెట్టైనా మాడిపోదా?
నా అరిష్టపు అడుగు పడితే అదృష్టమైనా ఆవిరైపోదా?
నన్ను ఇష్టపడే వారికి నేనిచ్చే బహుమతి ఏంటి?
నా దరిద్రాన్ని వాళ్లకు అంటిస్తాను!
నా దురదృష్టాన్ని వాళ్ల నొసట రాస్తాను!
నా కన్నీటి సముద్రంలో వాళ్లని ముంచేస్తాను!
నా సాంగత్యం అంటే.. చావును చంకన పెట్టుకోవడమే,
నా స్నేహం అంటే.. బ్రతికుండగానే సమాధి అవ్వడమే!
తోడున్న వాళ్లని నిలువునా దహించే దావాగ్నిని నేను,
అందరినీ చంపినంత పని చేసి, చావలేక మిగిలిన శవాన్ని నేను!
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి