ాల్చిన అట్లకాడతో వాతలు పెట్టడం ఎందుకో
అమాయకపు ఈ వీపుపై కోపాలు చూపడం ఎందుకో
సుతిమెత్తని నీ చేతులతో దోశలు తినిపించక
వీపును పెనముగా మార్చే ఈ వింత ఆలోచన ఎందుకో
కమ్మని రుచుల విందును వదిలి ఈ కఠిన చర్యలు
మనసును గాయపరిచే ఈ మూర్ఖపు పంతం ఎందుకో
ప్రేమగా ఒక్క ముద్ద నోటికి అందిస్తే చాలుగా
పగవానిలా నాపై ఈ పగలు ప్రతీకారాలు ఎందుకో
కవితలతో కడుపు నింపే ఈ 'సూర' కు
మళ్ళీ ఈ అట్లకాడల భయాలు బెదిరింపులు ఎందుకో
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి