తీరం చేరువైన వేళ... రెండు అడుగులే కలసి నడుద్దాం
దూరం తీరిపోయే వేళ... రెండు అడుగులే కలసి నడుద్దాం
ముచ్చటగా మలుపుల కాడ ఆగి మురిసిపోదాం రా
ఒక్క క్షణమైనా చాలు... రెండు అడుగులే కలసి నడుద్దాం
నిప్పులు కురిసే ఎండలో నిన్ను కనుపాపల్లో దాచి
రెప్పల నీడను పరిచి... రెండు అడుగులే కలసి నడుద్దాం
కాలం నడకకు అలిసిపోయి బొబ్బలెక్కెను చూడు
గతమంతా వెనకే వదిలేసి... రెండు అడుగులే కలసి నడుద్దాం
వెనుక చూస్తే శూన్యమే, ముందేమో కొత్త లోకాలు
తెలియని గమ్యం పిలిచే... రెండు అడుగులే కలసి నడుద్దాం
ఈ ప్రయాణమే ఒక కావ్యం కావాలి మనకు 'సూర'
జతగా అడుగులు వేస్తూ... రెండు అడుగులే కలసి నడుద్దాం
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి