కాల్చిన అట్లకాడతో వాతలు పెట్టడం ఎందుకో

అమాయకపు ఈ వీపుపై కోపాలు చూపడం ఎందుకో


​సుతిమెత్తని నీ చేతులతో దోశలు తినిపించక

వీపును పెనముగా మార్చే ఈ వింత ఆలోచన ఎందుకో


​కమ్మని రుచుల విందును వదిలి ఈ కఠిన చర్యలు

మనసును గాయపరిచే ఈ మూర్ఖపు పంతం ఎందుకో


​ప్రేమగా ఒక్క ముద్ద నోటికి అందిస్తే చాలుగా

పగవానిలా నాపై ఈ పగలు ప్రతీకారాలు ఎందుకో 


​కవితలతో కడుపు నింపే ఈ 'సూర' కు 

మళ్ళీ ఈ అట్లకాడల భయాలు బెదిరింపులు ఎందుకో