ముప్పై ఏళ్ల నిరీక్షణకు దొరికిన తీపి మజిలీ నా రవళి

లోకో షెడ్ సాక్షిగా మొదలైన ప్రేమ అంజలి నా రవళి.


కల్వరి చర్చి ముంగిట క్షణకాలం మెరిసిన నీ తొలి దర్శనం

కనురెప్పల వెనుక శాశ్వతంగా నిలిచిన మధుర స్వప్నం నా రవళి.


యారాడ కొండపై ఆ గాఢ కౌగిలి, ఆ తీపి ముద్దుల సాక్షిగా

రాస్ హిల్ చర్చి మౌనంలో దాగిన నా ప్రార్థన నా రవళి.


వెంకుపాలెం బ్రిడ్జిపై బైక్ సవారీ.. సగం కొరికి ఇచ్చిన రేగి వడియం

రుచి చూడని అమృతానికి అసలైన అర్థం నా రవళి.


ఊర్వశి స్టాపు, ఆర్టీసీ స్టేషను.. తగరంపూడి దారిలో అన్వేషణ

ప్రతి చోట నా కళ్ళు వెతికిన నీ అడుగుల ముద్ర నా రవళి.


నీ వైట్ షర్ట్, చిలక ఈక, కోలా పాపిన్స్, రెడ్ పిల్లో...

ప్రతి చిన్న గుర్తులోనూ ప్రాణం పోసిన నా ప్రాణం నా రవళి.


సామాజిక చట్రాలను అధిగమించి... విధి కరుణిస్తుందనే చిరు ఆశ

ఆ ఆశే ఊపిరిగా... నీ జత కోరుకుంటూ సాగేదే నా శ్వాస నా రవళి.


నిన్నటి జ్ఞాపకం నువ్వే.. నేటి నా బలం, రేపటి నా శ్వాస నువ్వే

ఈ ప్రపోజ్ డే సాక్షిగా "సూర" సర్వస్వం నీవే నా రవళి.