ప్రతి రేయి ఊసులతో ప్రణయమ్ము పలికేది

అణువణువు ముద్దులతో ఆశగా ముంచెత్తేది


బిగువైన కౌగిలిలో బంధించి వేవేళలా

నా గుండె సవ్వడిని నయముగా వినేది


నడిరేయి దాటినా నరనరాన పొంగే

శృంగార ప్రవాహం ఆగక సాగేది


తన జాడ లేక నేడు కనులకు కునుకేది?

ఒంటరి 'సూర' కంట నిదుర దూరమయ్యేది!