వేడి దోశల సువాసనలో నీ నవ్వు పరిమళం కలిసింది

అట్లకాడ చూపించి బెదిరించినా, అందులోనూ ఆప్యాయతే మెరిసింది.


వీపుపై వాతల మాటలు చెప్పినా నీ వేళ్లు మాత్రం తాకినప్పుడు  

చలిలో నన్ను కాపాడే ఆ స్నేహమే నాలో నిత్యం నిలిచింది.


ఒక్క ముక్క దోశలో నీ ప్రేమంతా నింపి నా చేతికి అందించినప్పుడు  

ప్రపంచం అంతా మరిచి నీ కళ్ళలోనే జీవించాను.


బెదిరింపుల వెనుక దాగి ఉన్న ఆ చిలిపి ప్రేమను తెలుసుకున్నాక  

నవ్వులలోనే మన కథను రాసుకున్నాను నీవే నేనై