ఈ రెండు లోకాల సుఖాలన్నీ వద్దు.. తోడుగా నువ్వుంటే చాలు
వేల వేల వరాలేవీ కోరను.. కళ్ళ ముందర నువ్వుంటే చాలు
కోట్ల సిరులున్నా నా కంటికి అవి కానరావులే
కటిక చీకటిలో నా చిన్ని దీపముగా నువ్వుంటే చాలు
నువ్వు లేని శ్వాస నిప్పుల వాగులా మారుతుంది
ఎడారి లాంటి నా బతుకులో వాన జల్లులా నువ్వుంటే చాలు
యుగాలైనా ఈ బంధం విడిపోదు, ఎప్పటికీ చెరిగిపోదు
మరుజన్మకైనా నాకు మిగిలే ఏకైక వరముగా నువ్వుంటే చాలు
దేవుడిని అడిగేది ఒక్కటే ఓ 'సూర'.. వేరే కోరిక లేదు
ఆఖరి శ్వాస వరకు నా గుండె లయగా నువ్వుంటే చాలు
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి