నన్ను నన్నుగా ప్రేమించే, ఓ నేస్తం నాకు దొరికే

ఏళ్ల తరబడి వేచినా, అందని స్నేహం దొరికే!


కౌగిలింతలో కరిగించి, ముద్దులతో మురిపించి

భార్యలా లాలించే, ఓ ఆత్మీయత దొరికే!


నా ఒడిలో తలవాల్చి, గుండె ఊసులు చెప్పగా

నలుగురిలో నను పెంచే, ఓ గౌరవం దొరికే!


నిజమో కాదో తెలియని, ఈ మాయ జగత్తులో

మనసుకు మాత్రం ఓ తీపి, సత్యం దొరికే!


కొద్ది రోజులే కావచ్చు, ఈ ఆనందం నాకు 

జీవితాంతం దాచుకునే, జ్ఞాపకం దొరికే!


మిస్సయ్యానని ఇన్నాళ్లు, మదనపడ్డాడు ఈ 'సూర' నువ్వు వచ్చిన వేళా... నా బ్రతుకు సారం దొరికే!