అందరిలాగే నువ్వూ నా కంట.. కన్నీరు తెప్పించావు

కాకపోతే కత్తులతో కాదు.. ప్రేమతో కరిగించావు!


వాళ్లు మాటల తూటాలు పేల్చి.. మనసును గాయం చేస్తే

నువ్వు మమకారపు వెల్లువతో.. హృదయాన్ని జయించావు!


నా ఊపిరి ఎక్కడ ఆగిపోతుందో.. అని భయపడ్డావేమో బుజ్జీ

విడవలేని కౌగిలింతలతో.. ఉక్కిరిబిక్కిరి చేసి బంధించావు!


దూరమైతే చస్తానని తెలిసి.. దగ్గరకు చేర్చుకున్నావు

అంతలోనే ఆదమరచి.. తీయని ప్రేమతో చంపావు!


ఈ 'సూర' ప్రాణం నిలపడానికేనా.. ఇన్ని పాట్లు పడ్డావు?

ఊపిరాడనివ్వని ప్రేమతోనే.. నాకు కొత్త ఊపిరి పోశావు!