ఎదురుగా నీవు లేకున్నా.. నా మౌనమై ఉండిపోయావు

దూరమయ్యావనుకున్నా.. నా ప్రాణమై ఉండిపోయావు


ఏ రాగమైనా, ఏ తాళమైనా.. నీ గుసగుసలే వింటున్నా

నా గుండె లోతుల్లో.. ఒక గానమై ఉండిపోయావు


లోకపు బంధాలన్నీ.. నీ కోసమే తుడిచేశాను

మరవలేని ఒక తీపి జ్ఞాపకమై ఉండిపోయావు


రూపం లేని నీ ప్రేమ.. నా ప్రతి అణువునూ తాకుతోంది

హృదయపు కాగితంపై.. ఒక చిత్రమై ఉండిపోయావు


నీవు లేని శూన్యాన్ని.. అక్షరాలతో నింపుతున్నాను

ఓ 'సూర'.. మనసులో  కావ్యమై ఉండిపోయావు